ఇందులేదు నిలుచు పట్టణం క్రీస్తు

induleedu niluchu pattannam kreesthu

🎵 TG-479💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఇందులేదు నిలుచు పట్టణం క్రీస్తు యాత్రికులకు నిందు లేదు నిలుచు పట్టణం ||ఇందులేదు నిలుచు||

1వ చరణం

పాదుకొన్న లౌకికునకు బహుళదుఃఖ మిది మఱి సొం పై దగు మేల్ చోటు వెదకు భక్తుఁడ వెత నొంద కెప్పు ||ఇందులేదు నిలుచు||

2వ చరణం

మాకు నిల్లి దైన దుఃఖ మౌకదా వచ్చు పురము దాకొనంగ వెదకె దము ధైర్య మిచ్చు నిదియె మాకు ||ఇందులేదు నిలుచు||

3వ చరణం

మనము యాత్ర వారి వలెనే ఘనత విశ్రమంబులేక కినుక నీలోక మునను గ్రింది వన్ని వదలు దాము ||ఇందులేదు నిలుచు||

4వ చరణం

మిగుల యాత్ర పరులవిశ్ర మించు సౌఖ్య వాసమా ఖగము వలెనే టెక్కలున్న నెగిరి నిన్నుఁ జేరుకొందు ||ఇందులేదు నిలుచు||

5వ చరణం

సద్దు నాయాత్మ నణంగ వద్దు తగిన వేళగామి యొద్ది కతని తలఁపు జేతుఁ నొసఁగు విశ్రమం బతండె ||ఇందులేదు నిలుచు||

Report Error