ఇన్నాళ్లు మాకు సాయమై యీ

innaalllu maaku saayamai yee

🎵 TG-035💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును మా యున్నత గృహ మండవై యొప్పెడు దైవమా!

1వ చరణం

ఏలాటి యీతిబాధయు నీవచ్చు యేఁటిలో కలుగకుండఁ బ్రోవవే ఘనంపు ప్రేమతో ||ఇన్నాళ్లు మాకు||

2వ చరణం

నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు భయంబు చింతబాధలన్ జయించి మందురు ||ఇన్నాళ్లు మాకు||

3వ చరణం

చరాచరంబు లెల్లను జనించుకంటె ముందార తరాలనుండియున్ నీరాజ్య మండెడున్ ||ఇన్నాళ్లు మాకు||

4వ చరణం

ఇన్నాళ్లు మాకు సాయమై యేలుచుఁ గాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింకనున్ ||ఇన్నాళ్లు మాకు||

Report Error