ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము
inneelllu ilaloo unnaamu manamu
🎵 TG-2738🌐 Telugu
పల్లవి
ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం సంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు||
1వ చరణం
లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం (2) పరలోకమే మనకు శాశ్వతం పరలోక దేవుని నిత్య జీవం ప్రేమామయుడే ఆ పరమాత్ముడే పదిలపరచెనే రక్షణ భాగ్యం మారు మనస్సు మనిషికి మార్గం పశ్చాత్తాపం మనసుకు మోక్షం నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించునే కలకాలం