ఇయ్యుడి మీకియ్యబడునని ఇయ్యగల శ్రీ

iyyudi meekiyyabadunani iyyagala shree

🎵 TG-570💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఇయ్యుడి మీకియ్యబడునని ఇయ్యగల శ్రీ యేసు ప్రభువు నెయ్యముతో తన శిష్యవితతికి నయముమీర జెప్పినట్లు ||ఇయ్యుడి మీకియ్యబడునని||

1వ చరణం

మొదట పరముని నంతునియ్యరే సదమల హృదయంబుతోడ సదయు డగు మన పరమతండ్రి ముదమతోడ నంతయు నిచ్చున్ ||ఇయ్యుడి మీకియ్యబడునని||

2వ చరణం

శక్తికొలది నియ్యవలెనని భక్తులందరితోడా జెప్పె భక్తితోడ ప్రభుని సేవకు శక్తికొలది నియవలెను ||ఇయ్యుడి మీకియ్యబడునని||

3వ చరణం

కొంచెముగ విత్తెడివారు కొంచెము సమకూర్చెదరు హెచ్చువిత్తెడి వారికిలను హెచ్చు ఫలములు నిండుగ దొరుకున్ ||ఇయ్యుడి మీకియ్యబడునని||

4వ చరణం

సంతసంబుతో నిచ్చెడివారి నెంతో దేవుడు కృపతో బ్రోచున్ వింతగా దీవెనలతోడ అంతయు దయచేసి బ్రోచున్ ||ఇయ్యుడి మీకియ్యబడునని||

5వ చరణం

యేసు కృపను ఎరిగిమనుడి యేసు మార్గమునందు నడువుడి దాసుడై ధనమంత విడిచె నీచులకొరకిలను మున్నె ||ఇయ్యుడి మీకియ్యబడునని||

6వ చరణం

పరమనిధులను నింపుకొనుడి పరమ దేవుని ప్రేమను గనుడి పరమ నిధులలో చిమ్మెటుండదు దొంగలసలే లేరుసుమండి ||ఇయ్యుడి మీకియ్యబడునని||

Report Error