జయ జయ యేసు జయయేసు

jaya jaya yeesu jayayeesu

🎵 TG-652💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

జయ జయ యేసు జయయేసు జయజయ క్రీస్తు జయక్రీస్తు జయజయరాజా జయరాజా జయజయస్తోత్రం జయస్తోత్రం ||జయ జయ||

1వ చరణం

మరణము గెల్చిన జయయేసు మరణము ఓడెను పరమ బలమొసగు జయయేసు సమాధి ఓడెను జయయేసు ||జయ జయ||

2వ చరణం

సమాధి గెల్చిన జయయేసు సమాధి ఓడెను జయయేసు క్షమించుము నను జయయేసు అమరమూర్తివి జయయేసు ||జయ జయ||

3వ చరణం

సాతాను గెల్చిన జయయేసు సాతాను ఓడెను జయయేసు పాతవి గతియించె జయయేసు దాతవు నీవే జయయేసు ||జయ జయ||

4వ చరణం

బండను గెల్చిన జయయేసు బండయు ఓడెను జయయేసు బండలుదీయుము జయయేసు అండకు ఓడెను జయయేసు ||జయ జయ||

5వ చరణం

ముద్రను గెల్చిన జయయేసు ముద్రయు ఓడెను జయయేసు ముద్రలు జీల్చుము జయయేసు ముద్రించుమునను జయయేసు ||జయ జయ||

6వ చరణం

కావలిగెల్చిన జయయేసు కావలి ఓడెను జయయేసు సేవలో బలమును జయయేసు జీవమునీవే జయయేసు ||జయ జయ||

7వ చరణం

దయ్యాల గెల్చిన జయయేసు దయ్యాలు ఓడెను జయయేసు కయ్యము కలిగిన జయయేసు అయ్యో నీవే జయయేసు ||జయ జయ||

Report Error