జయశీలుడా మా యేసయ్యా జీవించు వాడా మెస్సయ్యా
jayashiiluddaa maa yeesayyaa jiivinchu vaaddaa messayyaa
పల్లవి
జయమిచ్చు వాడా స్తోత్రముల్ నా ప్రాణప్రియుడా వందనం ఆ...ఆ..ఆ...ఆ...హల్లెలుయా (2) ఆ.........హల్లెలూయా
1వ చరణం
బలమిచ్చు వాడా బలవంతుడా- శక్తి నిచ్చు వాడా శక్తి మంతుడా తృప్తినిచ్చు వాడా తనయులకు - ముక్తి నిచ్చు వాడా మృత్యుంజయుడా మాకై మరల రానుంటివా - యేసు (2)
2వ చరణం
ఆదియు అంతము నీవేగా - ఆరాద్యుండవు నీవేగా అత్యున్నతుడా అతి ప్రియుడా - ఆత్మస్వరూపి ఆశ్రయుడా అనిశం నిన్నే కీర్తింతును - యేసు (2)
3వ చరణం
నీవే దిక్కని నమ్మితిని - నిన్నే గురిగా ఎంచితిని నీవే మాకు తండ్రివి - నీకు సమస్తము సాద్యమే నీపై సర్వం మోపితిని - యేసు (2)