జీవాహారము రమ్ము చిరజీవాన్నము నిచ్చి
jeevaahaaramu rammu chirajeevaannamu nichchi
పల్లవి
జీవాహారము రమ్ము చిరజీవాన్నము నిచ్చి జీవిత క్షుద దీర్చుము జీవనపథములో చీకటి పడువేళ జీర్ణించు కొనిపోవు జీవితాశలఁ బెంచ ||జీవాహారము రమ్ము||
1వ చరణం
విందుగృహమునకేగి వీక్షింతు భ్రమతో నీ వివిధసుభోజ్యంబులన్ విచ్ఛిన్నమైన నీ విమల దేహపు విందు వికలంబౌ మనసుతో వినుతించి, తినుచుందు ||జీవాహారము రమ్ము||
2వ చరణం
రుధిర ధారలలోన ఋజువౌ నీ ప్రేమలు రూపుమాయును పాపము ఋతద్రాక్ష వల్లీ నీ రుధిరపానముచేత ఋణభారములు దీరి రుచి యించు నా బ్రతుకు ||జీవాహారము రమ్ము||
3వ చరణం
భవదీయ స్మరణార్థం పతితుల శరణార్థం ఫలియించు యీహోమము ప్రభువా నాయాత్మలో ప్రతిబింబమై వెలసి పానార్పణంబౌను ప్రతిరక్త బిందువు ||జీవాహారము రమ్ము||
4వ చరణం
ఆత్మాంతఃపురములో ఆంతర్య గదిలోన ఆరాధించు నీ నామము అలనాటి నీ రక్త నవనిబంధన నేడు అపురూపమై నాలో నవతరించును దేవా ||జీవాహారము రమ్ము||