జీవమార్గమున్ యేసూ, చూపవే నీవు

jeevamaargamun yeesuu, chuupavee neevu

🎵 TG-430💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

జీవమార్గమున్ యేసూ, చూపవే నీవు మాకు ముందు వేగ వెంట వత్తు మేము వేగ తండ్రి యింటికే మమ్ము నడ్పవే

1వ చరణం

హింస కల్గెన మమ్ము గావుమా మమ్ము కష్టకాలమందు నాదరించు భూమియందు మింటిత్రోవలో మమ్ము నడ్పవే. ||జీవమార్గమున్ యేసూ,||

2వ చరణం

సొంత వేదనన్ చింత కల్గినన్ అన్య హింసఁ గూర్చి యేడ్వ మమ్ములన్ సహింపనిమ్ము మేము సత్యమున్ చూడ నేర్పవే. ||జీవమార్గమున్ యేసూ,||

3వ చరణం

మా ప్రవర్తన చక్కపర్చుమా మాకు నెట్టి హింసలైన నీ సహాయ మిచ్చి, నేటి యాత్రకాఁగానే తలుపు దీయవే. ||జీవమార్గమున్ యేసూ,||

Report Error