జీవితంబు ఘోర కష్టనష్టంబుల్ ఆవరించి

jeevithanbu ghoora kasstanasstanbul aavarinchi

🎵 TG-371💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

జీవితంబు ఘోర కష్టనష్టంబుల్ ఆవరించి నిన్ను దుఃఖపర్చిన దేవుడిచ్చినట్టి ఈవులెంచుము నీ వాశ్చర్య మొందెదవు. వానికై. ||జీవితంబు ఘోర||

1వ చరణం

చింతమానసంబు నీకు గల్గినన్ వంతచే భారంబు గల్గ నీయెదన్ సంతసంబుతోడ నెంచుమీవులన్ వింత నొందెదవు నీవు వానికై ||జీవితంబు ఘోర||

2వ చరణం

నాశనంబు జెందు నాస్తి జూడగా వాసిగా శ్రీ యేసు నీ కొసంగిన భాసురంపు భాగ్యముం దలంపుమా యీ సౌభాగ్యమే గదా సదా యుండు ||జీవితంబు ఘోర||

3వ చరణం

జీవితాదియందు ధైర్య మొందుము దేవుడుండు నెల్లవార్కి తోడుగ జీవయాత్ర యందు సాయమియ్యగన్ దేవదూతల్ నీకు తోడుగా నుండు. ||జీవితంబు ఘోర||

Report Error