జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం
jeevithanloo neerchukunnaanu oka paattham
🎵 TG-1528🌐 Telugu
పల్లవి
జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం యేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం (2) సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా ||జీవితంలో||
1వ చరణం
ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం నిరతము యేసునే స్తుతియించాలని కూడగట్టుకున్నాను శక్తన్తయు నిరతము యేసునే చాటించాలని ఆ యేసే నిత్య రాజ్యము ఆ యేసే గొప్ప సత్యము (2) ||జీవితంలో||
2వ చరణం
నిర్మించుకున్నాను నా జీవితం సతతం యేసులో జీవించాలని పయనిస్తు ఉన్నాను నా బ్రతుకులో యేసయ్య చిత్తము జరిగించాలని ఆ యేసే సత్య మార్గము ఆ యేసే నిత్య జీవము