జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే

jyootirmayuddaa - naa praanna priyuddaa - stuti mahimalu niikee

🎵 TG-1064💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే..... - 2 " జ్యోతి"

1వ చరణం

నా పరలోకపు తండ్రీ - వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా

2వ చరణం

నా పరలోకపు తండ్రీ - నా మంచి కుమ్మరి నీ కిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా

3వ చరణం

నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా త్రీయేక దేవా - ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద

Report Error