కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా

kaalam samayam naadeenantuu anukuntunnaavaa

🎵 TG-2434🌐 Telugu
పల్లవి

కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా (2) దేవుని ముందు నిలిచే రోజుంది తక్కెడ తూకం వేసే రోజుంది జీవ గ్రంథం తెరిచే రోజుంది నీ జీవిత లెక్క చెప్పే రోజుంది ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా ఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా (2)        ||కాలం||

1వ చరణం

ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావా మేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమో ఒక్క ఘడియలెందరో బికారులయ్యారు (2)         ||ఆగవేమయ్యా||

2వ చరణం

చూసావా భూకంపాలు కరువులు విపరీతాలు పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు నిన్నటి వరకు కొదువ లేదని అనుకున్నారు ఒక్క ఘడియలో ఎందరో నశించిపోయారు సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు సిద్ధపడని వారికి ఆ నరకపు ద్వారాలు అగ్ని ఆరదు పురుగు చావదు నిత్యం ఏడుపు దుఃఖాలు (2)           ||ఆగవేమయ్యా||

Report Error