కడవరి దినములలో రావాలి ఉజ్జీవం

kaddavari dinamulaloo raavaali ujjiivan

🎵 TG-1043💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

యేసుని అడుగులలో నడవాలి యువతరం భావి భారత పౌరులారా - కదలిరండి ఉత్తేజంతో క్రీస్తు రాజ్యవారసులారా - తరలిరండి ఉద్వేగంతో

1వ చరణం

క్రీస్తు సిలువను భుజమును మోస్తు - ఆసేతు హిమాలయం యేసు పవిత్ర నామం ఇలలో మారు మ్రోగునట్లు విగ్రహారాధనను భువిపై రూపు మాపే వరకు భారత దేశం క్రీస్తు రాకకై సిద్దమయ్యే వరకు కదలి రావాలి యువజనము - కలసి తేవాలి చైతన్యం (2) భావి భారత పౌరులారా - కదలిరండి ఉత్తేజంతో క్రీస్తు రాజ్యవారసులారా - తరలిరండి ఉద్వేగంతో

2వ చరణం

కులము, మతము మనిషికి రక్షణ ఇవ్వవని నినదించండి యేసుక్రీస్తు ప్రభువే ఇలలో లోక రక్షకుడనుచు మూఢ నమ్మకాలు భువిపై సమసిపోయే వరకు అనాగరికులు, మతోన్మాదులు - మార్పు చెందేవరకు కదలి రావాలి యువజనము - కలసి తేవాలి చైతన్యం (2) భావి భారత పౌరులారా - కదలిరండి ఉత్తేజంతో క్రీస్తు రాజ్యవారసులారా - తరలిరండి ఉద్వేగంతో

Report Error