కలువరి సిలువ సిలువలో విలువ
kaluvari siluva siluvaloo viluva
🎵 TG-1665🌐 Telugu
పల్లవి
కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా కలుషము బాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా (2) అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా (2) ||కలువరి||
1వ చరణం
కష్టాలలోన నష్టాలలోన నన్నాదుకొన్నావయ్యా వ్యాధులలోన బాధలలోన కన్నీరు తుడిచావయ్యా మధురమైన నీ ప్రేమ మరువగలనా ఆ ప్రేమ అనుక్షణం నీ ఆలోచన నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||
2వ చరణం
పాపానికైనా శాపానికైనా రక్తాన్ని కార్చావయ్యా దోషానికైనా ద్వేషానికైనా మరణించి లేచావయ్యా