కల్వరి గిరిజేరు మనసా సిల్వ

kalvari girijeeru manasaa silva

🎵 TG-202💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

కల్వరి గిరిజేరు మనసా సిల్వ సరస ||కల్వరి గిరిజేరు||

1వ చరణం

సిలువపై జూడు మదేమి శ్రీ కరుడు ప్రభుయేసు స్వామి తలను ముండ్ల కిరీటంబదేమి తరచి చూడుమీ ||కల్వరి గిరిజేరు||

2వ చరణం

పరులకుపకారంబు సల్ప ధరను వెలసిన వరపాదముల కఱకు మేకులు గొట్టెద రేల కరుణాలవాల ||కల్వరి గిరిజేరు||

3వ చరణం

కరముపట్టి దరిని జేర్చి వరములిడి దీవించిన యా కరుణగల చేతులలో చీల గుచ్చెద రేల ||కల్వరి గిరిజేరు||

4వ చరణం

ప్రేమ,కృప,నిర్మలత్వమును నీమమును గల మోముపైన పామరులుమి వేసెదరేల పాటించరేల ||కల్వరి గిరిజేరు||

5వ చరణం

ఘోర యాతనలును నీదు క్రూరమరణము చూడ గుండె నీరు నీరైపోవదె దేవ క్రూరునికైన ||కల్వరి గిరిజేరు||

6వ చరణం

పాపమేమిచేసి యెరుగవు పావన పరమదేవుడవు ఓ పరాత్పర నీకేమి యింత ఉత్కట బాధ ||కల్వరి గిరిజేరు||

7వ చరణం

స్వామి మాకై పూటపడను నీ ప్రేమయే కారణము నిజము భూమి యది గుర్తింపగ నిమ్ము పూజ్యుండ దేవ ||కల్వరి గిరిజేరు||

8వ చరణం

పావనాత్మ నీవు జావ పాపి కబ్బును నిత్యజీవ మావచన సత్యంబు దెల్పుము మానవాళికిన్ ||కల్వరి గిరిజేరు||

9వ చరణం

సిలువ దరికాకర్షించుము ఖలుడను ఘోరపాపిని కలుషములు విడ శక్తినీయుము సిలువ ధ్యానమున ||కల్వరి గిరిజేరు||

Report Error