కల్వరిలోని శ్రేష్టుడా కరుణభరిత సింహమా
kalvarilooni shreesstudaa karunnabharitha sinhamaa
కల్వరిలోని శ్రేష్టుడా కరుణభరిత సింహమా కన్ను భ్రమించు ప్రభువా సిలువలోని మిత్రుడా ||కల్వరిలోని శ్రేష్టుడా||
స్తుతికి పాత్రుండగువాడా దూతలతో వేంచేయువాడా సుదతి మరియ పుత్రుడా సిలువలోని మిత్రుడా ||కల్వరిలోని శ్రేష్టుడా||
పాపులకై వచ్చినవాడా ప్రేమగల్గిన రక్షకుడా పాదములపై బడితిమి సిలువలోనిమిత్రుడా ||కల్వరిలోని శ్రేష్టుడా||
దీవెనలు నిచ్చువాడా వసుధ కేతెంచినవాడా నీవే సుంకరలాప్తుడవు సిలువలోని మిత్రుడా ||కల్వరిలోని శ్రేష్టుడా||
ఐదు రొట్టెలు మరి రెండు చేపలతో నైదువేల జనుల పోషించిన తండ్రి సిలువలోని మిత్రుడా ||కల్వరిలోని శ్రేష్టుడా||
నీళ్ళను రసముగ మార్చితివి నీళ్ళమీద నడచితివి మేళ్ళనొసగు మాదాతా సిలువలోని మిత్రుడా ||కల్వరిలోని శ్రేష్టుడా||
రోగులను బాగుచేయువాడా గ్రుడ్డికి నేత్రములిచ్చితివి అనాధుల నాయకుడా సిలువలోని మిత్రుడా ||కల్వరిలోని శ్రేష్టుడా||
హల్లెలూయ కర్హుడా యెల్లరు కొనియాడువాడా బలముతో వచ్చు రాజా సిలువలోని మిత్రుడా ||కల్వరిలోని శ్రేష్టుడా||