కనురెప్ప పాటైన కను మూయలేదు

kanureppa paataina kanu muuyaleedu

🎵 TG-1610🌐 Telugu
పల్లవి

కనురెప్ప పాటైన కను మూయలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు – ప్రేమ ప్రేమ ప్రేమ (2) పగలూ రేయి పలకరిస్తోంది పరమును విడిచి నను వరియించింది కలవరిస్తోంది ప్రేమా ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ||కనురెప్ప||

1వ చరణం

ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది ప్రేమ రూపుతో నను మార్చియున్నది ప్రేమను మించిన దైవం లేదని ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తోంది ప్రేమా కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ ప్రేమ లోగిలికి నను పిలుచుచున్నది ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది ప్రేమకు ప్రేమే తోడవుతుందని ప్రేమకు సాటి లేనే లేదని పరవశిస్తోంది ప్రేమా

Report Error