కన్యా గర్భమున బుట్టి కరుణగల్గు

kanyaa garbhamuna butti karunnagalgu

🎵 TG-551💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

కన్యా గర్భమున బుట్టి కరుణగల్గు బాలుఁడవైన కన్యా సుతుండ నిన్నే నమ్మితి నో యేసునాధ కన్ను లెత్తి మమ్ముఁ జూడుము ||కన్యా గర్భమున||

1వ చరణం

బాల ప్రాయమున నేను బాగుగా నీ పాద సేవఁ జాలజేసి యున్న వా డనుగా యో యేసు నాధ చాల దయతో మేలు చేయుమి ||కన్యా గర్భమున||

2వ చరణం

ఇంపైనట్టి మరియ తనయ యిహము పరము నేలు బాల సొంపుగా నీ ప్రాపే గోరితి నో యేసునాధ చెంపఁ గొట్టి బుద్ధి చెప్పుము ||కన్యా గర్భమున||

3వ చరణం

తుంటతనము చేత జగము తంటాచేసి తిరుగుచుంటి నంటిన మాయల బాధల నో యేసు నాధ యంటుఁ బాపి జంటజేయుము ||కన్యా గర్భమున||

4వ చరణం

మింట నుండి నీవు వచ్చి మంటి పైని బాలుఁడ వగుచుఁ గంటి కింపు గాను నడిచితి వో యేసు నాధ కానుపర్చి తోవు త్రోవను ||కన్యా గర్భమున||

Report Error