కవులకైనా సాధ్యమా నీ కృపను

kavulakainaa saadhyamaa nee krupanu

🎵 TG-1862🌐 Telugu
పల్లవి

కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం ప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడం శిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడం రాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం (2) ||కవులకైనా||

1వ చరణం

చెదరిన మనసులకూ శాంతి కృంగిన హృదికీ ఓదార్పు మృత్యు దేహముకూ జీవం బలహీనులకు ఆరోగ్యం (2) పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలు గాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలు మోసపూరిత ఈ లోకంలో ఏ వైద్యునికి సాధ్యము (2)           ||కవులకైనా||

2వ చరణం

క్షణికమైన అనురాగాలు ఆవిరివంటి ఆప్యాయతలు అవసరాల అభిమానాలు నిలచిపోయే అనుబంధాలు నవ్యకాంతులమయమైన నీదు కల్వరి ప్రేమ ఆనందజ్వాలలు కలిగించే నీదు నిర్మల స్నేహం స్వార్ధపూరిత ఈ లోకంలో ఏ మిత్రునికి సాధ్యము (2)          ||కవులకైనా||

Report Error