కీర్తింతు నీ నామమున్ నా
keerthinthu nee naamamun naa
🎵 TG-2628🌐 Telugu
పల్లవి
కీర్తింతు నీ నామమున్ నా ప్రభువా… సన్నుతింతు నీ నామమున్ (2) మనసారా ఎల్లప్పుడు క్రొత్త గీతముతో నిను నే కొనియాడెదన్ (4) ||కీర్తింతు||
1వ చరణం
ప్రతి ఉదయం నీ స్తుతి గానం దినమంతయు నీ ధ్యానం ప్రతి కార్యం నీ మహిమార్ధం సంధ్య వేళలో నీ స్తోత్ర గీతం (2) ||కీర్తింతు||
2వ చరణం
నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ వేలాది స్తుతులన్ చెల్లిస్తూ ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ నిన్నే నేను ఆరాధిస్తూ అమూల్యమైనది నీ నామం ఇలలో శ్రేష్టమైనది నీ నామం ఉన్నతమైనది నీ నామం నాకై నిలచిన మోక్ష మార్గం