ఖండింపవలెను దుర్గుణములు ఖండింపవలెను ఖండింపవలెఁ
khandinpavalenu durgunnamulu khandinpavalenu khandinpavalem
ఖండింపవలెను దుర్గుణములు ఖండింపవలెను ఖండింపవలెఁ బాప ముండఁజూచి యేసు నండఁజేరి మన గుండె పదిలముఁ జేసి ||ఖండింపవలెను దుర్గుణములు||
అంధత్వమునను రక్షణమార్గ మందుఁ జేరకయు ఎందెందుఁ జూ చిన సందులేక పాప మందు మునిఁగి నరలా నందమోందక చెడిరి ||ఖండింపవలెను దుర్గుణములు||
ఎందు కీ భ్రమలు నీ యందుండు సందేహము వీడు పొందుగ యేసు సం బంధు డవై యున్న నందమైన మోక్ష మందుఁ జేరుట కొఱకు ||ఖండింపవలెను దుర్గుణములు||
బెదరక నీవు సాతానుని నెదిరింపవలెను కుదురుగ నీ యేసు చదరునఁ జేరిన వదరుబోతు లెల్ల నెదురాడ లేరిఁక ||ఖండింపవలెను దుర్గుణములు||
ఆసింపబోకు లోకభోగములు మోసమై యుండు వాసిగ యేసుని దాసుఁడవైయున్న గాసిఁ జెందక మోక్ష దాసుఁడ వౌదువు ||ఖండింపవలెను దుర్గుణములు||
నమ్మి జీవించు యేసుని యందు నెమ్మదిఁ బొందు రమ్ము యేసుని యొద్ద సొమ్ము నీకున్నది సమ్మతించి మదిని నెమ్మదిగాఁ జూచి ||ఖండింపవలెను దుర్గుణములు||