పల్లవి
యేసయ్య హల్లేలూయా నా యేసయ్య హల్లేలూయా "2" ఆరాధన స్తుతి ఆరాధనా -ఆరాధన ఘన ఆరాధన "2"
1వ చరణం
దేవాది దేవుడవు పరలోకమును వీడి - మానవ రూపాన్ని ధరియించినావు రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు - నీవే మా రక్షణ విమోచకుడా "2" "యేసయ్య"
2వ చరణం
మమ్మెంతగానో ప్రేమించినావు - నీ ప్రాణములనే అర్పించినావు "2" మా ప్రాణ నాధుడవు ఆధారభూతుడవు - నీవే మా రక్షణ విమోచకుడా "2" "యేసయ్యా"
3వ చరణం
ఆశ్చర్య కరుడవు ఆలోచనా కర్త - భలవంతుడైన మా దేవుడా "2" నిత్యుడగు తండ్రీ సమాదాన కర్తా - నీవే మా రక్షణ విమోచకుడా "2" "యేసయ్యా"