కొండ కోన లోయలోతుల్లో… ఓ

konda koona looyaloothulloo… oo

🎵 TG-1699🌐 Telugu
పల్లవి

కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ వినబడుతుంది నా యేసుని స్వరమే తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం || కొండ కోన ||

1వ చరణం

నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు హృదయమందు చేర్చుకో నేస్తమా (2) ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2)     ||కొండ కోన ||

2వ చరణం

ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు నిన్ను రక్షించాలని కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య

Report Error