కొండల తట్టు కన్నులెత్తుచున్నాను నాకు

kondala thattu kannuleththuchunnaanu naaku

🎵 TG-1844🌐 Telugu
పల్లవి

కొండల తట్టు కన్నులెత్తుచున్నాను నాకు సాయమెచ్చట నుండి వచ్చును భూమి యాకాశముల సృజించిన యెహోవా వలన సాయము కల్గున్ ||కొండల||

1వ చరణం

నీ పాదము తొట్రిల్ల నీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇశ్రాయేలును కాచు దేవుడు కునుకడు నిద్రపోడు యెన్నడు యెహోవాయే నిన్ను కాపాడును కుడి ప్రక్క నీడగా నుండును పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగులకుండ కాపాడును ఎట్టి అపాయమైన రాకుండ ఆయన నీ ప్రాణము కాపాడున్ ఇది మొదలుకొని నిత్యము నీ రాకపోకలందు నిను కాపాడున్

Report Error