కొండలలో కోనలలో బేతలేము గ్రామములో

kondalaloo koonalaloo beethaleemu graamamuloo

🎵 TG-2636🌐 Telugu
పల్లవి

కొండలలో కోనలలో బేతలేము గ్రామములో కనిపించె ప్రభు దూత వినిపించేను శుభ వార్త చెలరేగెనే ఆనందము రక్షకుని రాకతో (2)         ||కొండలలో||

1వ చరణం

కొరికేసే చలి గాలిలో వణికించే నడి రేయిలో (2) కాపరుల భయము తీర పామరుల ముదము మీర దూతా గానము శ్రావ్యా రాగము పరమ గీతము ||కొండలలో||

2వ చరణం

దావీదు పురమందున పశువుల శాలయందున మన కొరకే రక్షకుండు ఉదయించే పాలకుండు రండి వేగమే రండి శీఘ్రమే తరలి వేగమే

Report Error