కొనియాడఁ దరమె నిన్ను కోమల

koniyaadam darame ninnu koomala

🎵 TG-108💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

కొనియాడఁ దరమె నిన్ను కోమల హృదయ కొనియాడఁ దరమె నిన్ను తనరారు దినకరుఁ బెనుతారలను మించు ఘనతేజమున నొప్పు కాంతిమంతుఁడ వీవు ||కొనియాడఁ దరమె||

1వ చరణం

ఖెరుబులు సెరుపులు మరి దూతగణములు నురుతరంబుగఁ గొలువ నొప్పు శ్రేష్ఠుఁడ వీవు ||కొనియాడఁ దరమె||

2వ చరణం

సర్వలోకంబులఁ బర్వు దేవుఁడ వయ్యు నుర్వి స్త్రీ గర్భాన నుద్భవించితి వీవు ||కొనియాడఁ దరమె||

3వ చరణం

విశ్వమంతయు నేలు వీరాసనుఁడ వయ్యుఁ పశ్వాళితోఁ దొట్టిఁ పండియుంటివి నీవు ||కొనియాడఁ దరమె||

4వ చరణం

దోసంబులను మడియు దాసాళిఁ గరుణించి యేసు పేరున జగతి కేగుదెంచితి నీవు ||కొనియాడఁ దరమె||

5వ చరణం

నరులయందునఁ గరుణ ధర సమాధానంబు చీకాలమును మహిమ పరఁగఁ జేయుదు వీవు ||కొనియాడఁ దరమె||

6వ చరణం

ఓ యేసు పాన్పుగ నా యాత్మఁ జేకొని శ్రేయముగ బవళించు శ్రీకర వరసుత ||కొనియాడఁ దరమె||

Report Error