కొంతసేపు కనపడి అంతలోనే మాయమయ్యే

kontaseepu kanapaddi antaloonee maayamayyee

🎵 TG-1324💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ఆవిరివంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు

1వ చరణం

ఎదురవుతారెందరో నీ పయనములో - నిలిచేది ఎందరో నీ అక్కరలో వచ్చేదెవరో నీతో మరణము వరకు - ఇచ్చేదెవరో ఆపై నిత్యజీవం నీకు ||యేసే||

2వ చరణం

చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి - ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా - ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే - సంపాదన ఎవరిదగునో యోచించితివా ||యేసే||

3వ చరణం

నీ శాపము తానుమోసి పాపముతీసి - రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి విశ్రాంతినియ్యగా నిన్నుపిలువగా-నిర్లక్ష్యము చేసినా తప్పించుకుందువా ||యేసే||

Report Error