కోరుకొని యున్నాము యేసు ప్రభూ

koorukoni yunnaamu yeesu prabhuu

🎵 TG-561💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

కోరుకొని యున్నాము యేసు ప్రభూ కోరుకొని యున్నాము సార కల్యాణ గుణమణి సన్నిధి ||కోరుకొని యున్నాము||

1వ చరణం

చారు వివాహో త్సవము ఘనముగఁ జేయఁ గోరి దర్శన మి చ్చితివి గనుకఁ గూరిమితో నిది గో యీ పెండ్లికి మాకుఁ గారపు చుట్టము గా నిన్ను యేసూ ||కోరుకొని యున్నాము||

2వ చరణం

కరములు జోడించి పరస్సర ప్రమాణ భరము మోసిషిన యీ దం పతుల మీఁద వర కరుణైక్యతకు భ వదను గ్రహ కిరీట ము రచించి తద్భంధ మును నీవే దీవింపఁ ||కోరుకొని యున్నాము||

3వ చరణం

చనువొప్ప వారు క్రై స్తవ జాగరూకత లను దమ తమ వంతు లుభవించి మొనసి సంసార భర మును జులకన పర్చు కొను తదాత్మల మే ళన నీవు దయచేయఁ ||కోరుకొని యున్నాము||

4వ చరణం

ఘన విశ్వాస ప్రా ర్థన కోరికలయందుఁ దనర నొకరి కొకరు దయఁ జూపుచు నొనర కుటుంబంబు నురువు నొదింపంగ మనసారఁ దత్సంత తిని గాన డయచేయఁ ||కోరుకొని యున్నాము||

Report Error