క్రైస్తవుండా కదలిరావయ్యా కలుషాత్ములకు
kraistavundaa kadaliraavayyaa kalushaatmulaku
కండలను ప్రేమింతువేమయ్యా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా
వసుధలో ప్రజలెల్లరు యేసు వాక్యంబు విని క్షుద్బోదగొని వాదించు చుండగను మిషనులెల్ల మిషలచేత మిట్టపడుచు వాదములచే యేసు బోధను మరచినారన్నా నీవెంత కాలము వారి చెంత వుందువోరన్నా ||క్రైస్తవుండా||
సత్య వాక్యము సంతలో దులిపి భోదకుల దొరల భత్యములపై భాంతులు నిలపి - చిత్తమగు అనుకూల బోధలు చేసి ప్రజల మోసగించే - సూత్రదారుల చేరరాదయ్య - సుఖ భోగమిడిచి సత్య వాక్యము చాటరావయ్యా ||క్రైస్తవుండా||
శక్తిహీనుడవందు వేమయ్యా సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా - భక్తిహీనత పారద్రోలి భష్ట మనసు బయలు పరచి - శక్తితో సువార్త చాటుదువు సువార్తచే జయమొంది ఆత్మల రక్షించెదవు ||క్రైస్తవుండా||
నీతికై భక్తాది పరులెల్లా - నిజ విశ్వాసము నిలుపుకొన పోరాడిరే చాలా - కత్తిపోటులు రాళ్ళ దెబ్బలు కరుకుగల రంపములు కోతలు -బెత్తముల కొరడాల దెబ్బలు పైబడి చేర్చే దేహము వాలలాడెను రక్తము భూమిపై ||క్రైస్తవుండా||
దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియ సఖుడా ఖ్యాతిగా నీకిచ్చె గ్రంధంబు - ఖేతీయుల వినుము గ్రంధము తేనెవలె మధురముగా నుండును - జ్ఞానము నీకబ్బునో హితుడా జ్ఞానంబు నొంది స్వామిని సేవించుమో సఖుడా ||క్రైస్తవుండా||
ఆది సంఘము నార్పుటకునేంచి - ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి - ఆది క్రైస్తవ భక్తుల స్థంభముల గట్టి తారు పూసి అగ్నిని ముట్టించి కాల్వంగ - ఆ సంఘమొచ్చె అధిపతి అప్పుడే నశియించే ||క్రైస్తవుండా||