క్రీస్తు నేడు లేచెను ఆ

kreesthu needu leechenu aa

🎵 TG-222💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ మర్త్యదూత సంఘమా ఆ ఆ ఆ హల్లెలూయ భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ బాడుమిందు చేతను ఆ ఆ ఆ హల్లెలూయ.

1వ చరణం

మోక్ష మియ్య నాథుడు ఆ ఆ ఆ హల్లెలూయ యుద్ధమాడి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ సూర్యుఁడుద్భవింపగ ఆ ఆ ఆ హల్లెలూయ చీకటుల్ గతించెను ఆ ఆ ఆ హల్లెలూయ. ||క్రీస్తు నేడు||

2వ చరణం

బండ, ముద్ర, కావలి ఆ ఆ ఆ హల్లెలూయ అన్ని వ్యర్థమైనవి ఆ ఆ ఆ హల్లెలూయ యేసు నరకంబును ఆ ఆ ఆ హల్లెలూయ గెల్చి ముక్తిఁ దెచ్చెను ఆ ఆ ఆ హల్లెలూయ. ||క్రీస్తు నేడు||

3వ చరణం

క్రీస్తు లేచినప్పుడు ఆ ఆ ఆ హల్లెలూయ చావుముల్లు త్రుంచెను ఆ ఆ ఆ హల్లెలూయ ఎల్లవారిఁ బ్రోచును ఆ ఆ ఆ హల్లెలూయ మృత్యువింక గెల్వదు ఆ ఆ ఆ హల్లెలూయ. ||క్రీస్తు నేడు||

4వ చరణం

యేసు మృతి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ మేము కూడ గెల్తుము ఆ ఆ ఆ హల్లెలూయ యేసుఁడుండు చోటుకు ఆ ఆ ఆ హల్లెలూయ మేము కూడఁ బోదుము ఆ ఆ ఆ హల్లెలూయ. ||క్రీస్తు నేడు||

5వ చరణం

భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ యేసు, నీకు స్తోత్రము ఆ ఆ ఆ హల్లెలూయ మృత్యు సంహారకుండ ఆ ఆ ఆ హల్లెలూయ నీదె నిత్యజయము ఆ ఆ ఆ హల్లెలూయ. ||క్రీస్తు నేడు||

Report Error