క్రీస్తు సిల్వ నాకు గొప్ప

kreesthu silva naaku goppa

🎵 TG-623💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

క్రీస్తు సిల్వ నాకు గొప్ప యౌను, నేనుతింపుదు సచ్చరిత్రు కాంతి యొప్ప గాని జుట్టి యుండును

1వ చరణం

నాకు నే విచారమైన భీతి యైన కల్గినన్ సిల్వ రూప మెందునైన సంతసింప జేయునన్ ||క్రీస్తు సిల్వ||

2వ చరణం

మోక్ష సూర్య దైన కాంతి నాదు త్రోవ బుట్టుగా సిల్వనుండి కల్గు శాంతి దాని నింపు చేయుగా ||క్రీస్తు సిల్వ||

3వ చరణం

లాభ, లోభ, మోగు, బాగు శుద్ధి యౌను సిల్వచే సంతసంబు శాంతి జాగు లేక కల్గునప్పుడే, ఆమేన్. ||క్రీస్తు సిల్వ||

Report Error