కృపామయుడా – నీలోనా
krupaamayudaa – neeloonaa
🎵 TG-1781🌐 Telugu
పల్లవి
కృపామయుడా – నీలోనా (2) నివసింప జేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప జేసినందునా కృపామయుడా… ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున (2) ||కృపామయుడా||
1వ చరణం
చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసెదను (2) ||కృపామయుడా||
2వ చరణం
నీలో నిలిచి ఆత్మ ఫలము ఫలియించుట కొరకు నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు (2) ||కృపామయుడా||
3వ చరణం
ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నను వీడక శాశ్వత కృపగా మారెను