కుమ్మరి చేతిలో మంటి వలె
kummari cheethiloo manti vale
🎵 TG-1826🌐 Telugu
పల్లవి
కుమ్మరి చేతిలో మంటి వలె తల్లి ఒడిలో పసి బిడ్డ వలె (2) అయ్యా నీ కృపతో నన్ను మార్చుము యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము ||కుమ్మరి||
1వ చరణం
నాలోని స్వయమును నలుగ గొట్టుము నాలోని వంకరలు సక్కగా చేయుము నీ పోలిక వచ్చే వరకు నా చేయి విడువకు సారె పైనుండి తీసివేయకు (2) ||కుమ్మరి||
2వ చరణం
నాలోని అహమును పారద్రోలుము నాలోని తొందరలు తీసి వేయుము నీ భుజముపై ఆనుకొనే బిడ్డగా మార్చుము నీ చేతితో నడిపించుము