లాల లాలలలా లాలలలా లా
laala laalalalaa laalalalaa laa
🎵 TG-1733🌐 Telugu
పల్లవి
లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా (2) అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం (2) ||లాల||
1వ చరణం
దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు దీనులను రక్షించే దేవ తనయుడు దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె విజయ వీరుడై ఉద్భవించెనే పశుల పాకలో పరుండియుండెనే ||లాల||
2వ చరణం
ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే లోకానికి రక్షకుడు వెలిసెనని తార వెంబడి వెళ్లి వారు కానుకలర్పించి ఆరాధించారు ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు దూత గణములే జోల పాడగా సృష్టికి బహు సంబరమాయెగా