లెక్కింపలేని స్తొత్రముల్ - దేవా ఎల్లప్పుడు నే పాడెదన్
lekkinpaleeni stotramul - deevaa ellappuddu nee paaddedan
పల్లవి
ఇంత వరకు నా బ్రతుకులో - నీవు చేసిన మేళ్ళకై
1వ చరణం
ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్ని - ప్రభువా నిన్నే కీర్తింతున్ "లెక్కి“
2వ చరణం
అడవిలో నివసించున వన్ని - సుడిగాలియు మంచును భూమిపైనున్నవన్ని - దేవా నిన్నే పొగడును "లెక్కి"
3వ చరణం
నీటిలో నివసించు ప్రాణుల్ - ఈ భువిలోని జీవరాసు లు ఆకాశమున ఎగురునవన్ని - ప్రభువా నిన్నే కీర్తించున్ "లెక్కి"