మా నాన్న యింటికి నేను వెళ్ళాలి
maa naanna yinttiki neenu vellllaali
పల్లవి
నా తండ్రి యేసుని నేను చూడాలి మా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది మా నాన్న యింటిలో సంతోషం ఉన్నది మా నాన్న యింటిలో నాట్యమున్నది
1వ చరణం
మగ్ధలేని మరియలాగా నీ పాదాలు చేరెదను కన్నీటితో నేను కడిగెదను తల వెంట్రుకలతో తుడిచెదను ||మా||
2వ చరణం
బేతనీయ మరియలాగా నీ సన్నిధి చేరెదను నీ వాక్యమును నేను ధ్యానించెదను ఎడతెగక నీ సన్నిధి చేరెదను ||మా||
3వ చరణం
నీ దివ్య సన్నిధి నాకు మధురముగా ఉన్నదయ్యా పరలోక ఆనందం పొందెదను ఈ లోకమును నేను మరిచెదను ||మా||