మా ఊహలు పుట్టక మునుపే

maa uuhalu puttaka munupee

🎵 TG-2350🌐 Telugu
పల్లవి

మా ఊహలు పుట్టక మునుపే – మా సర్వమునెరిగిన దేవా (2) ఇహపరములలో నీవే – మా కోర్కెలు తీర్చెడి ప్రభువా విశ్వాస నిరీక్షణతో – కనిపెట్టియున్నచో పొందెదము ఎన్నో మేలులూ – ప్రభువా నీ పాద సన్నిధిలో (2)          ||మా ఊహలు||

1వ చరణం

నిన్నడుగకుండగనే – మోషేను పిలచితివి నిన్నడిగిన సొలోమోనుకు – జ్ఞాన సిరుల నొసగిన దేవా పలు సమయముల యందు – పలు వరముల నిచ్చితివి అడుగనేల ప్రభువా ఈ ధరలో – నీ దివ్య కృపయే చాలు ||మా ఊహలు||

2వ చరణం

ప్రార్ధించుచుంటిమి – సమస్యలు తీర్చమని నిన్నడుగుచున్నాము నీ – రాజ్యములో చోటిమ్మని ఊహించు వాటికంటె – అధికముగా నిచ్చెడి దేవా ఇంతకంటె మాకేమి వలదు – నీ తోడు నీడే చాలు

Report Error