మాకర్త గట్టి దుర్గము నే

maakartha gatti durgamu nee

🎵 TG-037💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

మాకర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబు సంప్రాప్తమైన కష్టములన్నిటి నణంచు ఆ పాత శత్రువెంతో క్రూరుఁడు తదాయుధములుపాయ శక్తులు అతం డసమానుండు.

1వ చరణం

మేమో నశించిపోదుము మా శక్తి నిష్ఫలంబు మాకై ప్రభుని శూరుఁడు యుద్దంబు చేసిపెట్టు అతం డెవ్వఁడు? యేసు క్రీస్తను మా రక్షకుండు మరొక్కఁ డెవ్వడు? అతండె గెల్పుపొందు ||మాకర్త గట్టి||

2వ చరణం

ప్రపంచ మంతటన్ గ్రమ్ము పిశాచు లేమి చేయు? మమ్మెల్ల మ్రింగనున్నను మాకేల భేతివేయు? ఈ లోకాధిపుఁడుగ్రుఁడైనను దానేమి చేయుఁ? దీర్పొందె నతఁడు నశించు మాటతోనే. ||మాకర్త గట్టి||

3వ చరణం

వాక్యంబు నిత్యమే గదా విరోధి వంచ లేఁడు. దైవాత్మ తోడగుం గదా తా నిన్న నేఁడు రేపు. మా కుటుంబము మా కీర్తి, యాస్తి, ప్రాణంబు పోయినన్ నష్టంబు వానిదె రాజ్యంబు మాది యౌను. ||మాకర్త గట్టి||

Report Error