మానవుడవై సకల నరుల మానక

maanavudavai sakala narula maanaka

🎵 TG-2793🌐 Telugu
పల్లవి

మానవుడవై సకల నరుల మానక నా దోషముల బాపుటకు బలియైతివే యేసు – (2) బహు ప్రేమ తోడ ||మానవుడవై||

1వ చరణం

నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమను నీదు దివ్య ప్రేమ నొందుటకు – నియమంబు నిచ్చి నీ శరీరము రొట్టె వలెనె నిజముగా విరువంగబడెనే నిన్ను దిను భాగ్యంబు నిచ్చితివే – నా యన్న యేసు మంచి యూట మించి దండి పంచ గాయములలో నుండి నిత్య జీవపు టూటలు జేసితి – నీ ప్రేమ నుండి నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు నీదు ప్రేమ బలిలో మనుటకు నిత్య మాచరించుడంటివి నీ – నిజ భక్తి తోడ ఎంతో ప్రేమతో బలిగానయితివి యెంతో ప్రేమాచారమైతివి చింతలును నా పాపములు బాప – శ్రీ యేసు దేవా నిత్య బలియగు నిన్నే నమ్మి నిన్ను ననుభవించి నెమ్మి నిన్ను నిముడించుకొని నాలో నీ – నిజ రూప మొంద నేను నీ బలిలోన గలిసి నేను నీతో గలిసి మెలిసి నేను నీవలె నుండి జేసితివే – నా దివ్య యేసు నీదు శ్రమలను బలిని నిపుడు నాదు కనులు చూడ నెపుడు నాదు పాప భారములు దిగునే – నీవు బలియై తిరిగి లేచి నిత్య తేజోరూపు దాల్చి నిత్యమును నా బంతి నున్నావే – నిజ దేవా యేసు నీవే నీ చేతులలో నిత్తువు ఈ నీ బలి విందునకు వత్తువు నిన్ను నిట జూచితిని నా యేసు – ఎన్నడును మరువను

Report Error