మానవుల మేలు కొరకు జ్ఞానియైన
maanavula meelu koraku jnyaaniyaina
పల్లవి
మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు మానుగఁ కల్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా ||మానవుల మేలు||
1వ చరణం
కానాయను నూరిలో మన కర్త చూచెఁ బెండ్లిని పానముగను ద్రాక్షరసము దాన మొసఁగెఁ బ్రీతిని ||మానవుల మేలు||
2వ చరణం
యేసూ వీరిద్దరిని ఏకముగాఁ జేయుమీ దాసులుగను జేసి వీరి దోసము లెడబాపుమీ ||మానవుల మేలు||
3వ చరణం
కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును బూర్తిగ నీ విచ్చి వీరిఁ బొందుగాను నడుపుమీ ||మానవుల మేలు||
4వ చరణం
భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమీ ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగులఁ జేయుఁమీ ||మానవుల మేలు||