మారని దేవుడవు నీవేనయ్యా మరుగై

maarani deevudavu neeveenayyaa marugai

🎵 TG-2351🌐 Telugu
పల్లవి

మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2) సుడులైనా సుడిగుండాలైనా – వ్యధలైనా వ్యాధి బాధలైనా (2)         ||మారని||

1వ చరణం

చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2)       ||మారని||

2వ చరణం

నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2)         ||మరని||

Report Error