మాటే చాలయ్యా యేసూ నాకు

maatee chaalayyaa yeesuu naaku

🎵 TG-1722🌐 Telugu
పల్లవి

మాటే చాలయ్యా యేసూ నాకు నీ మాటలోనే జీవం ఉన్నది (2) నీ మాట వల్లె జరుగును అద్భుతాలు నీ మాట వల్లె జరుగును ఆశ్చర్యాలు నీ మాటకు సమస్తం సాధ్యమే (2)        ||మాటే||

1వ చరణం

సృష్టికర్తవు నీవే – సమస్తము సృజియించితివి సృష్టంతయ నీ మాటకు లోబడుచున్నది నీ మాటకు శక్తి ఉన్నదయ్యా నీ మాటకు సమస్తం లోబడును (2)        ||నీ మాట వల్లె||

2వ చరణం

పరమ వైద్యుడవు నీవే – స్వస్థపరచు దేవుడవు దయ్యములన్ని నీ మాటకు లోబడి వొణుకును నీ మాటలో స్వస్థత ఉందయ్యా నీ మాటతోనే విడుదల కలుగును జీవాధిపతి నీవే – జీవించు దేవుడవు నీ జీవము మమ్ములను బ్రతికించుచున్నది నీ మాటలో జీవం ఉందయ్యా నీ మాటలే మాకు జీవాహారాము

Report Error