మహిమ నీకే ప్రభూ
mahima neekee prabhuu
🎵 TG-2548🌐 Telugu
పల్లవి
మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ (2) స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ ఆరాధనా… ఆరాధనా… ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే ||మహిమ||
1వ చరణం
సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే – నీ సర్వము నాకిచ్చితివే (2) ||ఆరాధనా||
2వ చరణం
ఎంతో ప్రేమించి నాకై ఏతించి – ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివే నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప – ఏర్పర్చుకొంటివే