మహిమ నీకే ప్రభూ - ఘనతనీకే ప్రభూ
mahima niikee prabhuu - ghanataniikee prabhuu
పల్లవి
స్తుతియు,మహిమ ఘనతయు - ప్రభావము నీకే ప్రభూ ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే- నా యేసు ప్రభునకే
1వ చరణం
సమీపింపరాని తేజస్సు నందు – వశియించు అమరుండవే శ్రీమంతుడవే- సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే "ఆరాధ"
2వ చరణం
ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే "ఆరాధ"
3వ చరణం
ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి - నను పిలచి వెలిగించితివే నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప - ఏర్పర్చుకొంటివే "ఆరాధ"