పల్లవి
మహిమ నొప్పు జనక నీకు మహిత సుతునకు మహిమ గలుగు శుద్ధాత్మకును మహా యుగములు ||మహిమ నొప్పు||
1వ చరణం
లోక సృష్టి మునుపు నిన్ను నాకసేనలు ప్రాకటంబుగా నుతించెఁ బ్రజ్ఞ మీరంగ ||మహిమ నొప్పు||
2వ చరణం
సకల సృష్టివలన దేవ సకల యుగముల సకల గలుగు నీకు సకల కాలము ||మహిమ నొప్పు||