మహిమగల తండ్రి – మంచి
mahimagala thandri – manchi
మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడు మహితోటలో నర మొక్కలు నాటించాడు (2) తన పుత్రుని రక్తనీరు – తడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను – కాపుగా వుంచాడు కాయవే తోటా – కమ్మని కాయలు పండవే చెట్టా – తియ్యని ఫలములు (2) ||మహిమ||
నీతి పూత జాతి కర్త – ఆత్మ సుతా ఫలములు నీ తండ్రి నిలువచేయు – నిత్య జీవ ఫలములు అనంతమైన ఆత్మ బంధ – అమర సుధా కాంతులు అనుకూల సమయమయ్యె – పూయు పరమ పూతలు (2) ||కాయవే||
అపవాది కంటబడి – కుంటుబడి పోకు కాపుకొచ్చి చేదు పండ్లు – గంపలుగా కాయకు అదిగో గొడ్డలి వేరు – పదును పెట్టియున్నది వెర్రిగా చుక్కలనంటి – ఎదిగి విర్రవీగకు కలువరి కొండలో పుట్టి – పారిన కరుణా నిధి కలుషమైన చీడ పీడ – కడిగిన ప్రేమానిధి నిజముగాను నీవు – నీ సొత్తు కావు యజమాని వస్తాడు – ఏమి ఫలములిస్తావు ముద్దుగా పెంచాడు – మొద్దుగా నుండకు మోదమెంతో ఉంచాడు – మోడుబారి పోకు ముండ్ల పొదలలో కృంగి – మెత్తబడి పోకు పండ్లు కోయ వచ్చువాడు – అగ్నివేసి పోతాడు