మనస! యాత్మ! తేజరిల్లుమా యలంకరించు

manasa! yaathma! theejarillumaa yalankarinchu

🎵 TG-276💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

మనస! యాత్మ! తేజరిల్లుమా యలంకరించు కొనుము పాప మంత వీడుమా వినుము నేఁడు యేసు నీకు ఘనముగాను విందుఁ జేసి నినుఁ దలచి చేరవచ్చె ఘనుని వెల్గులోని కేగుము ||మనస! యాత్మ!||

1వ చరణం

హృదయ మనెడు తలుపుఁ దట్టుచుఁ ప్రభు యేసు నిలచి సదయుఁ డిదిగో నిన్నుఁ బిలుచుచు ఎదురు జూచుచుండు విభుని పదయుగమున కెరగి మ్రొక్కి ముదముతోడఁ జేర్చుకొనుము సదముల మగు ప్రేమఁ జూపి ||మనస! యాత్మ!||

2వ చరణం

ధరను సర్వ శ్రేష్ఠ భాగ్యముల్ వరములును ధనము నరులు బొందు చుందు రుచితము పరమ రక్షకుం డొసంగు వరశరీర రక్తములకు ధరణి రత్న రాసులైనఁ జాలువా మరేవి యైన ||మనస! యాత్మ!||

3వ చరణం

ఎందుఁ గానరాని ప్రేమను జూపించి నీకై పొందుగాఁ దన ప్రాణ మిచ్చెను చిందిన రక్తమును యాగ మంది నట్టి శరీరంబు నందముగను రాత్రి భోజ నంబు నందు సిద్ధపరచె ||మనస! యాత్మ!||

4వ చరణం

యేసు తనదు బల్లమీఁను సుజీవ మిచ్చు నెల్ల నష్టములు నశించును భాసురముగ మోక్షమునని వాసివై శ్రీ యేసుతోడ యీ సుభో జనంబు దినుట కాశీర్వాదములు నొసంగు ||మనస! యాత్మ!||

Report Error