మనసా వినవేమే క్రీస్తునిఁ గని

manasaa vinaveemee kreesthunim gani

🎵 TG-331💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

మనసా వినవేమే క్రీస్తునిఁ గని సేవింపవేమే అనుదినమున నీ కాయువు క్షీణం బగుచున్నది గదవే ||మనసా వినవేమే||

1వ చరణం

చింతలేల నీకు వర శ్రీ మంతుడుండు వరకు చెంతను జేరక యెంతసేపు నీ యంతట నుండెదవే ||మనసా వినవేమే||

2వ చరణం

లోకాశలకును నీవు లోకువై యుండకుము ఆకాశము నేలెడు మన ప్రభువును ప్రాకటముగ నమ్ము ||మనసా వినవేమే||

3వ చరణం

మాయ సంతలోన జిక్కి మాయలఁ బోయెదవు కాయము స్థిరమని నమ్మకు మీ నీ ప్రాయము దక్కదుగా ||మనసా వినవేమే||

4వ చరణం

రక్షకయని వేఁడు నీవు రక్షణకై వేఁడు రక్షణఁ బొందుట కిదియే సమయము తక్షణమున వేఁడు ||మనసా వినవేమే||

5వ చరణం

అందరమును గూడి యేసుని మందిరమునఁ జేరి పొందుగ క్రీస్తుని పొగడుచుఁ బాడుచు నందునఁ జేరుదము ||మనసా వినవేమే||

Report Error