మనసారా పూజించి నిన్నారాధిస్తా భజనలు
manasaaraa puujinchi ninnaaraadhisthaa bhajanalu
🎵 TG-2449🌐 Telugu
పల్లవి
మనసారా పూజించి నిన్నారాధిస్తా భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోష గానాలను ఆలాపిస్తా (3) ||మనసారా||
1వ చరణం
నిన్న నేడు ఉన్నవాడవు నీవు (2) ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు (2) ||మనసారా||
2వ చరణం
రక్షణ కొరకై లోకానికి వచ్చావు సాతాన్ని ఓడించిన విజయశీలుడవు మరణము గెలిచి తిరిగి లేచావు నీవే మర్గము సత్యము జీవము (2) ||మనసారా||