మంచి దేవుడు భలే మంచి దేవుడు
manchi deevuddu bhalee manchi deevuddu
పల్లవి
నిజ దైవం యేసు - అద్వితీయ దేవుడు
1వ చరణం
మ్రొక్కులను కోరడు - మనసిస్తే చాలును కొండలెక్కి రమ్మనడు - మనలో కొలువుంటాడు వెదికితే ప్రతి వారికి - దొరికేను యేసు పిలిచే ప్రతి వారికి - పలికేను యేసు బొమ్మ కాదయ్యో - జీవమున్న దేవుడు "మంచి"
2వ చరణం
కుంటివాడు గంతులేయ - కాళ్ళ నొసగినాడు మూగవారు స్తుతిచేయ - నోటినిచ్చినాడు బధిరులు తన స్వరము విన - చెవులిచ్చినాడు ప్రేమా మయుడు - ఆశ్చర్య దేవుడు "మంచి"
3వ చరణం
చెప్పింది చేసెను - మాదిరుంచి వెళ్ళెను అడుగు జాడాలుంచెను - అనుసరించ కోరెను మరణాన్ని జీవాన్ని - మన ఎదుటే వుంచెను ఎంచుకొనే స్వేచ్చను - మన చేతికిచ్చెను ఏమి చేతువో - సృష్టికర్త యేసుని "మంచి"